ఏటీఎంల వద్ద ప్రజల పడిగాపులు సైనిక చర్య, కొవిడ్ మహమ్మారితో మయన్మార్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో ప్రజలు తమ రోజువారీ అవసరాలు, ఖర్చుల కోసం.. నగదును డ్రా చేసుకునేందుకు ఏటీంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది ఆహారం తెచ్చుకుని మరీ ఏటీఎంల ముందు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.
క్యూలో నిలబడలేక.. అవస్థలు తమ వంతు రాకముందే..
ఒక్కో ఏటీఎంలో ఎంత నగదు డ్రా చేయాలో పరిమితి విధిస్తున్నారని యాంగాంగ్ నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వంతు వచ్చేసరికి ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయని వాపోతున్నారు. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లు క్యూలో నిల్చోకుండా టోకెన్లు జారీ చేస్తున్నారని.. అయితే ఆ టోకెన్లు బుక్ చేసుకునేందుకు కార్యాలయాలకు ఫోన్లు చేస్తే స్పందించటం లేదన్నారు.
గొడుగులతో కూర్చొని ఎదురుచూపు క్యూలో నిలబడలేక.. అవస్థలు ఏటీఎంల వద్ద ప్రజల పడిగాపులు ఇటీవల యూఎన్డీపీ(యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) సైతం.. మయన్మార్‌లోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో సైనిక పాలన, కొవిడ్ మహమ్మారి దృష్ట్యా.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపింది.
ఇదీ చదవండి :దేశం 'లాక్డౌన్'- అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు!