ఆస్ట్రేలియాలో ప్రస్తుతం విస్తరిస్తోన్న కార్చిచ్చు వల్ల అక్కడ జీవించే కోలా బేర్ జాతికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. తాజాగా న్యూ సౌత్వేల్స్లోని ఉత్తర సిడ్నీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగడం వల్ల వేల సంఖ్యలో కోలా బేర్లు మరణించాయి. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రస్తుతం అక్కడ దాదాపు 28 వేలకు పైగా కోలా బేర్లు నివసిస్తున్నాయి.... ఇటీవల విస్తరిస్తోన్న కార్చిచ్చు వల్ల వీటి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
ఇదీ చూడండి : కార్చిచ్చులో మూగజీవి నరకయాతన- కాపాడిన వీరనారి
ఆందోళన వ్యక్తం
ఇటీవల కార్చిచ్చు నుంచి తప్పించుకున్న కోలా బేర్లు దాహార్తితో నీరు కోసం అలమటిస్తున్నాయి. అటుగా వెళ్లే బాటసారులు వాటికి నీరు అందిస్తోన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు చలించిపోయి...అక్కడి పర్యావరణ మంత్రికి మెయిల్స్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.
"ఇప్పటికే 30 శాతం దాకా కోలా బేర్లు ఆవాసాలు కాలి బూడిదయ్యాయి. దావాగ్ని పరిస్థితి అదుపులోకి రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం."