తెలంగాణ

telangana

ETV Bharat / international

అల్బేనియాలో ఉద్ధృతంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు - Albanian

అల్బేనియాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్షం ఆధ్వర్యంలో వేలాది మంది స్థానికులు రాజధాని వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న వారిపై పోలీసులు బాష్పవాయువు​ ప్రయోగించారు.

అల్బేనియాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

By

Published : Jun 9, 2019, 7:04 AM IST

Updated : Jun 9, 2019, 8:36 AM IST

అల్బేనియాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

అల్బేనియా దేశంలో ఫిబ్రవరి నుంచి జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్​ పార్టీ అధ్వర్యంలో వేలాది మంది ఆందోళనకారులు రాజధాని టిరానా వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని 'ఈది రామ'కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ఆందోళన కారులను అదుపుచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు వందలాది మందిపై బాష్పవాయువు​ ప్రయోగించారు. పోలీసుల చర్యపై ప్రభుత్వ వ్యతిరేకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించారు.

ప్రభుత్వంపై ఆరోపణలు

'ఈది రామ' నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం నేరాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష డెమోక్రటిక్​ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో రిగ్గింగ్​ చేస్తోందని అందుకే ముందస్తు ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తోసిపుచ్చిన ప్రధాని

ప్రతిపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు అల్బేనియా ప్రధాని ఈది రామ. ఇలాంటి ఆందోళనలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని ప్రజలకు విన్నవించారు.

ఇదీ చూడండి : 'ఆచూకీ చెప్తే రూ.5 లక్షల నగదు బహుమతి'

Last Updated : Jun 9, 2019, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details