ప్రపంచ దేశాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా నమోదైన 4,37,050 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 4 కోట్ల 14 లక్షల 69 వేలు దాటింది. 11 లక్షల 36 వేల 260 మంది మరణించారు.
ఉగ్రరూపం
అమెరికాలో మళ్లీ కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 63,663 మందికి పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 85 లక్షల 84 వేలు దాటింది. మరో 1,225మంది మరణించారు.
బ్రిటన్‌లో ఒక్కరోజే 26,688 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల90 వేలకు చేరువైంది. కొత్తగా 191మంది కొవిడ్‌కు బలయ్యారు.
ఫ్రాన్స్‌లో కొత్తగా 26,676 కేసులు వెలుగుచూశాయి.దీంతో మొత్తం బాధితుల సంఖ్య 9 లక్షల 57 వేలు దాటింది. మరో 163 మంది ప్రాణాలు కోల్పోయారు.
బ్రెజిల్‌లోనూ ఇటీవల కొవిడ్ కేసులు కాస్త తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 25,832 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 53 లక్షలు దాటింది. ఒక్కరోజే 571మంది మృతి చెందారు.
పాక్‌లో మళ్లీ లాక్డౌన్!
కరోనా నిబంధనలు అమలు చేయడంలో విఫమవుతున్నట్లు తెలిపింది పాక్ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్స్ సెంటర్(ఎన్సీఓసీ). ఈ మేరకు దేశంలో మళ్లీ లాక్డౌన్ విధించాలని ఎన్సీఓసీ భావిస్తున్నట్లు ఆ దేశ వార్తా సంస్థ తెలిపింది.
- అర్జెంటీనాలో కొత్తగా 18,326మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 419మందిని మహమ్మారి పొట్టనపెట్టుకుంది.
- స్పెయిన్‌లో తాజాగా 16,973 కేసులు నమోదవగా.. 156మంది మృతి చెందారు.
- రష్యాలో ఒక్కరోజే 15,700 మందికి కరోనా సోకింది. మరో 317మంది మరణించారు.
- మెక్సికోలో 555 మంది మరణాలు.. 5,788 కేసులు నమోదయ్యాయి.
- ఇటలీలో తాజాగా 15,199మంది వైరస్ బారిన పడగా.. 127మంది మరణించారు.
ఇదీ చూడండి:పాక్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం