'హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్' పేరిట హాంగ్కాంగ్ వాసులు ప్రత్యేక పండుగ జరుపుకున్నారు. ప్రతిఏటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో... వెదురు బొంగుల సహాయంతో ఓ బొమ్మను తయారు చేసి వీధుల్లో ఊరేగిస్తారు.
ఘోస్ట్ మాస్టర్
16 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బొమ్మకు... తల, బూట్లు, విడిభాగాలు తయారుచేసి అతికిస్తారు. రంగురంగుల కాగితాలను అతికించి అలంకరిస్తారు. కార్మికుల ప్రేమకు చిహ్నంగా భావించే ఈ ప్రతిమను హాంగ్కాంగ్ ప్రజలు 'ఘోస్ట్ మాస్టర్'గా పిలుస్తారు.
'ఘోస్ట్ మాస్టర్'... గువాన్ యిన్ అవతారం అయినందున దీనిని' డై సీ 'అని పిలుస్తారు. గ్వాన్ యిన్ అస్థిరమైన దెయ్యాలను అణచివేయడానికి వాటిరూపాన్నే స్వీకరించాడు. ఏటా ఈ ఉత్సవం జరిగే వేదికకూ విశేష ప్రాధాన్యం ఉంటుంది.