తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేస్తున్న థాయ్​​లాండ్

థాయ్​లాండ్​ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పౌరులు భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2014 సైనిక తిరుగుబాటు అనంతరం ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

By

Published : Mar 24, 2019, 3:44 PM IST

ఓటు వేస్తున్న థాయ్​లాండ్ ప్రధాన పార్టీల నేతలు

థాయ్​లాండ్ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు
థాయ్​లాండ్​లో జరుగుతున్న జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2014లో సైనిక తిరుగుబాటు అనంతరం తొలిసారి థాయ్​లాండ్​లో ఎన్నికలు జరుగుతున్నాయి. సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించి 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన ప్రయూత్ చాన్​​ ఓచా.. మరోసారి అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఓచా పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవడాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు. దేశంలో సైనిక పాలన నుంచి విముక్తి పొందడానికి భారీ సంఖ్యలో ప్రధానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలను కోరాయి.

ABOUT THE AUTHOR

...view details