థాయ్‌లాండ్ రైల్వే మార్కెట్ థాయ్‌లాండ్‌లోని ఓ మార్కెట్ ప్రత్యేకంగా నిలుస్తోంది. పర్యటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక మేక్లాంగ్ రైల్వేస్టేషన్‌కు కొద్ది దూరంలో ఈ మార్కెట్‌ను నిర్వహిస్తారు. అదీ రైలు పట్టాలపై, పట్టాలకు ఆనుకొనే... గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. ట్రైన్ వస్తే ఎలాగంటారా...? ఏముంది.. స్టాళ్లను పక్కకు తప్పించడమే.. మరి వ్యాపారం ఎలా నడుస్తుందంటారేమో... రైలెళ్లగానే.. తిరిగి ప్రత్యక్షమవుతాయిగా..!
ఇవీ చూడండి:
వీరికి ఓటు వేసే అవకాశం కల్పించలేమా?
ఢాబాలో రాహుల్ భోజనం... హేమకు కోపం
ప్రతి రోజూ మార్కెట్‌కు ఏడు సార్లు దర్శనమిస్తుంది రైలు. ఆ సమయంలో సందడి వాతావరణం నెలకొంటుంది. థాయ్‌లోని ఈ మార్కెట్.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పర్యటకుల్ని ఆకర్షిస్తోంది.
అయితే.. మార్కెట్లో ఏదో విక్రయించడానికి మాత్రమే అంటే పొరబడ్డట్లే. రైలు వచ్చేటప్పుడు ఆ ప్రత్యేక దృశ్యాన్ని కెమెరాలో బంధించడానికి.. స్వీయ చిత్రాలు తీసుకోవడానికి జనం పోటెత్తుతారు. ట్రైన్ అత్యంత సమీపంగా వచ్చేవరకు పక్కకు తప్పుకునే ప్రసక్తే లేదు. వారిని తప్పించడానికి స్థానిక పోలీసు అధికారులు అపసోపాలు పడాల్సివస్తోంది.
రైలు వస్తే విక్రేతలు.. వాటి గుడారాలు, గొడుగులను(స్టాళ్లు) లోపలికి లాక్కుంటారు. రైలు వెళ్లగానే మళ్లీ యథా స్థానాల్లోకి వెళ్లాల్సిందే. ఇది వారి జీవితంలో ఒక భాగంలా మారిపోయింది. దీనిని స్థానికులు 'తలాడ్ రోమ్ హూప్ మార్కెట్' లేదా 'అంబ్రిల్లా పుల్డౌన్ మార్కెట్' అని పిలుచుకుంటారు.
''మేం.. ఈ మార్కెట్ ప్రత్యేకతను ఇంటర్నెట్లో చూసి తెలుసుకున్నాం. కొన్ని బ్లాగులు, వాట్సప్ ఛానెళ్ల ద్వారా ఈ ప్రాంతం గురించి అంచనాకొచ్చాం. అందుకే.. మేం ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాం.. మాకు మేముగా తెలుసుకోవాలని.''
- లుకాస్, ప్రియురాలితో బ్రెజిల్ నుంచి వచ్చిన పర్యటకుడు
ఈ మార్కెట్‌కున్న ప్రత్యేకతల దృష్ట్యా ఇదొక సరైన పర్యటక ప్రదేశమని భావిస్తారు పర్యటకులు. రైలు ట్రాక్‌లు నిర్మించకముందే ఇక్కడ మార్కెట్ ప్రసిద్ధిగాంచింది. వారాంతాల్లో అయితే... రోజూ సుమారు 2 వేల మంది ఈ మార్కెట్‌ను సందర్శిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా పర్యటకుల్ని విశేషంగా ఆకట్టుకోవడానికి.. థాయ్‌లాండ్ పర్యటక సంస్థ ఇలాంటి విశిష్టతలున్న ఆదాయవనరు మార్గాల్ని ఎంచుకుంటుంది. ఫలితంగా.. డబ్బు, పేరు రెండూ వస్తున్నాయి. 2018లో సుమారు 38 మిలియన్ల మంది దేశంలో పర్యటిస్తే.. అందులో 2 మిలియన్ల మంది మేక్లాంగ్ను, రైల్వే మార్కెట్‌ను సందర్శించడం విశేషం.
''ఇక్కడి షాపుల్లో సుమారు 50 సంవత్సరాల నుంచి ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది మాకెప్పుడూ కష్టమనిపించలేదు.''
- నొప్పాడోల్ ఇమెమ్కోసా, రెస్టారెంట్ నిర్వాహకుడు
పర్యటకుల రద్దీతో మార్కెట్లో షాపింగ్‌కు ఇబ్బందవుతుందని అప్పుడప్పుడు స్థానికుల నుంచి ఫిర్యాదులూ వస్తుంటాయి. జనం తక్కువైతే ఎప్పుడెప్పుడు షాపింగ్ చేద్దామా అని ఎదురుచూస్తుంటారట. అయితే.. థాయ్‌లాండ్ ప్రభుత్వం పర్యటకుల్ని ఆకర్షించడానికి వినూత్న ప్రయత్నం చేస్తుంటే.. మరో పక్క తమకు లాభాల్లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్లోని విక్రేతలు.
''నా ఆదాయం తగ్గింది. దానికి కారణం ఆర్థికవ్యవస్థ. ఎందుకంటే.. పర్యటకులు సందర్శిస్తారు. కానీ.. వారు సముద్రపు చేపల్ని కొనుగోలు చేయరు. నేనొకవేళ.. పండ్లను అమ్మితే మాత్రం అది మంచి ఆదాయ వనరు అవుతుంది.''
- లేక్, సముద్రపు చేపల విక్రేత
ఇవీ చూడండి:
భారత్ భేరి: ఉపాధిపై రాజకీయ పకోడీలు
భారత్ భేరి: తమిళ కింగ్‌మేకర్ దినకరన్?