హాంగ్‌కాంగ్ ప్రభుత్వం ప్రతిపాదించిన వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలు తీవ్రరూపు దాల్చాయి. నేరారోపణలపై విచారణ కోసం దేశ పౌరులను చైనాకు అప్పగించే బిల్లును పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌తో ప్రజలు మరోమారు నిరసన బాట పట్టారు. లక్షలాది సంఖ్యలో తరలివచ్చి హాంగ్‌కాంగ్ వీధుల్ని దిగ్బంధించారు. విక్టోరియా పార్క్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఉన్న వాన్చాయ్ జిల్లా వరకు కవాతు నిర్వహించారు. ఫోన్ల లైట్లు చూపుతూ నిరసన తెలిపారు.
రద్దు... రాజీనామా.....
ఎక్స్ట్రాడిషన్ బిల్లు వివాదంతో కొద్దిరోజులుగా హాంగ్‌కాంగ్ అట్టుడుకుతోంది. నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం... బిల్లును ప్రస్తుతానికి పక్కనబెడుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయినా ప్రజలు సంతృప్తి చెందలేదు.