తెలంగాణ

telangana

ETV Bharat / international

హింసాత్మకంగా హాంగ్​ కాంగ్ నిరసనలు - హాంగ్ కాంగ్

హాంగ్​ కాంగ్ స్వేచ్ఛను చైనా హరించేలా ప్రవర్తిస్తోందంటూ ఆ దేశ ప్రజలు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువును, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు.

హింసాత్మకంగా హాంగ్​ కాంగ్ నిరసనలు

By

Published : Jul 22, 2019, 8:51 AM IST

హింసాత్మకంగా హాంగ్​ కాంగ్ నిరసనలు

చైనా పాలనా విధానాలకు వ్యతిరేకంగా హాంగ్ కాంగ్ ప్రజలు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు, రబ్బర్​ బుల్లెట్లను ప్రయోగించారు. నిరసనకారులు చైనా కార్యాలయంపై గుడ్లతో దాడి చేశారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయోగించిన భాష్పవాయువుతో నగరంలో దట్టమైన పొగ వ్యాపించింది.

ప్రభుత్వ మద్దతుదారులైన సాధారణ ప్రజలూ ముసుగులు ధరించి ఆందోళనకారులపై దాడులకు దిగారు. ఈ దాడుల్లో పలువురికి గాయలయ్యాయి. హాంగ్​కాంగ్​లో ఈ మధ్య కాలంలో జరిగిన నిరసనల్లో ఇదే పెద్దదని అంచనా.

బ్రిటిష్​ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న హాంగ్​కాంగ్ 1997 జులై 1న చైనా పరిపాలనలోకి వచ్చింది. 'ఒకే దేశం, రెండు వ్యవస్థలు' ద్వారా ఇప్పటికీ ప్రత్యేక పాలన సాగిస్తోంది. చైనా పరిపాలనలోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'వాన్ చై'లోని కన్వెన్షన్ సెంటర్​లో ప్రభుత్వం సోమవారం సంబరాలు నిర్వహించింది. ఈ ఉత్సవాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్డెక్కారు.

నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​ ప్రజలు ఇటీవలే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వారం రోజుల పాటు జరిగిన ఈ నిరసనల అనంతరం ఆ బిల్లును పక్కనబెడుతున్నట్లు హాంగ్​కాంగ్ ప్రభుత్వాధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి: మోదీ 2.0కు 50 రోజులు- మార్పు దిశగా భారత్​

ABOUT THE AUTHOR

...view details