అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాలను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు తాజాగా ఈశాన్య అఫ్గాన్‌లోని బదక్షన్‌లోని చెందిన పలు ప్రాంతాలను వశం చేసుకున్నారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో పలు అఫ్గాన్ దళాలు సరిహద్దు దాటి తజికిస్థాన్‌లో ఆశ్రయం పొందాయి. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. సుమారు 300 మంది సైనికులు శనివారం సాయంత్రం 6.30 గంటలకు సరిహద్దు దాటారని పేర్కొన్నారు.
యుద్ధం లేకుండానే తాలిబన్ల వశమైన ఈశాన్య అఫ్గాన్
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోతుండటం వల్ల తాలిబన్ల హవా మళ్లీ మొదలైంది. ఈశాన్య రాష్ట్రమైన బదక్షన్‌లోని పలు ప్రాంతాలు వారి చేతిలోకి వెళ్లాయి. అఫ్గాన్ సైన్యం ప్రతిఘటించకపోవడం వల్ల యుద్ధం లేకుండానే ఆ ప్రాంతాలు కైవసమయ్యాయి.
తాలిబన్ల వశమైన ఈశాన్య అఫ్గాన్
బదక్షన్‌లోని అనేక ప్రాంతాలు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్ల వశం అయ్యాయని అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల్లో 10 జిల్లాలను తాలిబన్లు ఆక్రమించగా అందులో 8జిల్లాలు.. యుద్ధం లేకుండానే తాలిబన్ల అధీనంలోకి వెళ్లాయని పేర్కొన్నారు. సైన్యానికి సరైన వనరులు లేకపోవడం వల్లే తాలిబన్లు ఆక్రమించగలిగారని తెలిపారు.
ఇదీ చదవండి :బలగాల ఉపసంహరణతో పెనుముప్పుగా తాలిబన్లు!
Last Updated : Jul 5, 2021, 11:56 AM IST