అమెరికన్లు అఫ్గాన్‌ను వీడిన వెంటనే తాలిబన్లు పంజ్‌షేర్‌పై దృష్టి పెట్టారు. సోమవారం అర్ధరాత్రి తాలిబన్లు పంజ్‌షేర్‌లోకి అడుగు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని(Taliban Attack Panjshir) రెసిస్టెన్స్ ఫోర్స్ బలగాలు తిప్పి కొట్టాయి. ఈ విషయాన్ని అహ్మద్ మసూద్ ప్రతినిధి ఫహిమ్ దస్తీ పేర్కొన్నారు. తాలిబన్లు(Afghanistan Taliban) తమ ఔట్‌పోస్టుపై దాడి చేసిన క్రమంలో జరిగిన పోరాటంలో ఇరు పక్షాల వైపు పలువురు గాయపడ్డారని ఆయన వెల్లడించారు. తాలిబన్ల వైపు 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. రెసిస్టెన్స్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు కూడా గాయపడ్డారన్నారు. పంజ్‌షేర్(Panjshir Valley) వాసులు కేవలం లోయ కోసమే పోరాడటంలేదని.. పూర్తి అఫ్గాన్ కోసం పోరాడుతున్నారని ఫాహిమ్ పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, మైనార్టీలకు తాలిబన్లు హక్కులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన తాలిబన్లు..