తెలంగాణ

telangana

ETV Bharat / international

'చైనా ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గం' - తైవాన్ నేషనల్ డే

చైనా ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గబోమని తేల్చి చెప్పింది తైవాన్‌(Taiwan China News). ఆ దేశం నుంచి ఒత్తిళ్లు పెరిగే కొద్దీ తాము మరింత పురోగతి సాధిస్తుంటామని పేర్కొంది. చైనా దుందుడుకుగా వ్యవహరించదని ఆశిస్తున్నామని చెప్పింది.

taiwan china conflict
తైవాన్, చైనా వార్తలు

By

Published : Oct 11, 2021, 7:21 AM IST

చైనా ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గమని తైవాన్‌(Taiwan China News) తేల్చి చెప్పింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు(Taiwan China Conflict) పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఆదివారం తైవాన్‌ నేషనల్‌ డే సందర్భంగా అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌ వెన్‌(Taiwan China News) ఈ మేరకు ప్రసంగించారు.

"చైనా నుంచి ఒత్తిళ్లు పెరిగే కొద్దీ మేము మరింత పురోగతి సాధిస్తుంటాము. చైనా మాకు చూపిస్తున్న మార్గంలో వెళ్లమని మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ప్రజాస్వామ్య రక్షణకు తైవాన్‌ ముందు వరుసలో ఉంటుంది. బీజింగ్‌తో సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తేలికపడతాయని.. ఆ దేశం దుందుడుకుగా వ్యవహరించదని ఆశిస్తున్నాను. తైవాన్‌ ప్రజలు చైనా ముందు తలొగ్గుతారని మాత్రం ఊహించుకోవద్దు"

-త్సాయి ఇంగ్‌ వెన్‌, తైవాన్ అధ్యక్షురాలు

తైవాన్‌-చైనాలను(Taiwan China Conflict) ఏకం చేసి తీరతామని శనివారం జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పే తీరులో త్సాయి ప్రసంగం సాగింది.

మరోపక్క జిన్‌పింగ్‌ హెచ్చరికలు..

డాక్టర్‌ సన్‌యెట్‌ సేన్‌ నేతృత్వంలోని జాతీయ ఉద్యమం చైనాలో రాజరిక పాలనను అంతమొందించి 110 ఏళ్లు నిండిన సందర్భంగా బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శనివారం ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రధాన భూభాగంలో తైవాన్‌ అంతర్భాగమేనని ఉద్ఘాటించారు. ద్వీప దేశ స్వతంత్రతకు మద్దతు తెలిపే శక్తులకు మంచి ముగింపు ఉండదని పరోక్షంగా హెచ్చరించారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details