తెలంగాణ

telangana

ETV Bharat / international

సరిహద్దులో పావురం.. పాక్​ ఏజెంట్​గా అనుమానం!

భారత సరిహద్దు ప్రాంతంలో ఓ పావురం స్థానికులకు చిక్కింది. దాని కాళ్లకు ఓ రింగు కట్టి ఉంది. దాని మీద నంబర్లు ఉన్నాయి. ఆ కపోతాన్ని అధికారులకు అందజేశారు. ఇది పాకిస్థాన్​లో శిక్షణ పొందినట్లుగా అనుమానిస్తున్నారు.

Suspected 'spy' pigeon from Pakistan captured along IB in J-K
సరిహద్దులో పావురం కలకలం.. పాక్​​ రహస్య ఏజెంట్​గా అనుమానం!

By

Published : May 25, 2020, 5:29 PM IST

పాకిస్థాన్​ నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్న ఓ గూఢచారి పావురాన్ని.. జమ్ముకశ్మీర్​ కథువాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పట్టుకున్నారు స్థానికులు. ఆదివారం ఆ కపోతాన్ని స్థానిక పోలీసు స్టేషన్​కు అందజేసినట్లు పేర్కొన్నారు. పక్షి కాలికి ఓ రింగు​ ఉందని.. దానిపై నంబర్లు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే సైనిక అధికారులకు సమాచారం అందించారు.

సరిహద్దులో పట్టుకున్న పావురం

పాక్​ పనేనా..?

పక్షి ఓ రహస్య సందేశాన్ని(కోడెడ్ మెసేజ్​) పట్టుకెళ్తున్నట్లు పేర్కొన్నారు ఆర్మీ అధికారులు. ప్రస్తుతం ఆ సమాచారాన్ని ఛేదించే పనిలో ఉన్నట్టు వెల్లడించారు. హిరానగర్​ సెక్టార్​లోని మన్యరి గ్రామంలోని స్థానికులు.. ఆ పక్షి పాక్​ వైపు నుంచే వచ్చినట్లు తెలిపారు.

ఈ పావురం దాయాది దేశంలో శిక్షణ పొందినట్లు భావిస్తున్న అధికారులు.. ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ ప్రారంభించారు. సైనిక స్థావరాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు వచ్చిందా? ఎవరైనా దేశంలో ఏదైనా అలజడి సృష్టించనున్నారా? అనే అంశాలపైనా దృష్టిసారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details