తెలంగాణ

telangana

ETV Bharat / international

తైవాన్​లో భూకంపం- 17 మందికి గాయాలు

తైవాన్​లో తీవ్ర భూకంపం సంభవించింది. ఇళ్లు, భవనాలు కంపించాయి. భయబ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు తీశారు. దేశవ్యాప్తంగా సుమారు 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

తైవాన్​లో భూకంపం... 17 మందికి గాయాలు

By

Published : Apr 18, 2019, 5:41 PM IST

తైవాన్​లో భూకంపం... 17 మందికి గాయాలు

తైవాన్​ దేశాన్ని భూకంపం కుదిపేసింది. రిక్టర్​ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్​ సర్వే సంస్థ తెలిపింది. భూకంపం ధాటికి భవనాలు కంపించాయి, ట్రాఫిక్​ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

భూకంపంతో తైవాన్​ రాజధాని తైపీలో ఆకాశహర్మ్యాల్లోని పాఠశాలల పిల్లలు భయబ్రాంతులకు గురయ్యారు. తరగతి గదుల్లోంచి పరుగులు తీశారు.
యిలాన్​, హువాలిన్​ మధ్య జాతీయ రహదారిని మూసివేశారు. మధ్యాహ్నం 1గంట సమయంలో సుమారు 33 సెకన్ల పాటు 19 కిలోమీటర్ల మేర భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

హువాలిన్​ ప్రాంతంలో రాళ్లు మీదపడి ఇద్దరు గాయపడ్డారు. ఓ మలేషియా పర్యటకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. అతనికి గుండెపోటు కూడా వచ్చిందని అధికారులు తెలిపారు. తైపీ నగరవ్యాప్తంగా ఇంకో 15 మంది గాయపడ్డారు. నగరంలోని దెబ్బతిన్న రెండు భవనాలను ఖాళీ చేయించారు. తైపీ మెట్రోను తాత్కాలికంగా నిలిపేశారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు.

హువాలిన్​ నగరంలో గతేడాది సంభవించిన భూకంపంలో 17 మంది మరణించారు. సుమారు 300 మంది గాయపడ్డారు.

తైవాన్​లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 1999 సెప్టెంబర్​లో అత్యధికంగా 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. గడిచిన దశాబ్ద కాలంలో ఇదే అతిపెద్దది. ఇందులో సుమారు 2400 మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details