తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా: చైనా తర్వాత దక్షిణ కొరియాలోనే ఎక్కువ

దక్షిణ కొరియాను కరోనా బెంబేలెత్తిస్తోంది. ఆ దేశంలో కొత్తగా 161 కేసులు నమోదుకాగా.. ఇప్పటివరకు వైరస్​ సోకిన వారి సంఖ్య 763కు చేరింది. చైనా తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశంగా కొరియా నిలిచింది. దీనితోపాటు మృతుల సంఖ్య 7కు పెరిగింది.

South Korea becomes biggest coronavirus centre outside China
కోరనా: చైనా తర్వాత దక్షిణ కొరియాలోనే ఎక్కువ

By

Published : Feb 24, 2020, 9:05 AM IST

Updated : Mar 2, 2020, 9:10 AM IST

చైనాలో మొదలైన ప్రాణాంతక కరోనా వైరస్​ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. దక్షిణ కొరియాలో సోమవారం మరో 161 కేసులను గుర్తించారు అధికారులు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్​ బారినపడ్డ వారి సంఖ్య 763కు చేరింది. ఈ నేపథ్యంలో చైనా తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశంగా దక్షిణ కొరియా నిలిచింది.

కొత్తగా నమోదైన కేసుల్లో 129మంది డేగులోని షిన్​చియోంజి చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. మహమ్మారి వల్ల తాజాగా మరో ఇద్దరు మరణించగా.. మృతుల సంఖ్య 7కు పెరిగింది.

ప్రభుత్వ చర్యలు...

వైరస్​ నేపథ్యంలో మహమ్మారి తీవ్రతను అత్యధిక ప్రమాదకర స్థాయిగా ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు మూన్​ జే ఇన్​. మరోవైపు పాఠశాల సెలవులను ఇంకో వారానికి పొడిగించింది ప్రభుత్వం. చైనా నుంచి వచ్చే వారిని రెండు వారాల పాట పర్యవేక్షణలో ఉంచాలని యోచిస్తోంది.

ఫిబ్రవరి 10న కరోనా వైరస్​ బారిన పడ్డ ఓ మహిళ.. అంతకు ముందు నగరంలోని నాలుగు చర్చిలకు హాజరైనట్లు అధికారులు భావిస్తున్నారు. డేగులో సుమారు 2.5 మిలియన్ల జనాభా ఉంటుంది. వైరస్​ లక్షణాలున్నట్లు అనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని నగర మేయర్​ సూచించారు.

Last Updated : Mar 2, 2020, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details