తెలంగాణ

telangana

ETV Bharat / international

కెమెరాకు చిక్కిన అరుదైన మంచు చిరుతలు - జంతుజాతులు

చైనా చింగాయ్​ ప్రాంతంలోని కిలియన్​ షాన్​ జాతీయ వన్యప్రాణి పార్కులో అరుదైన మంచు చిరుతలు కెమెరాకు చిక్కాయి. వీటి సంఖ్యపై పరిశోధనలు జరుగుతున్నాయి.

కెమెరాకు చిక్కిన అరుదైన మంచు చిరుతలు

By

Published : Apr 1, 2019, 10:27 AM IST

కెమెరాకు చిక్కిన అరుదైన మంచు చిరుతలు

చైనాలో వన్యప్రాణులపై చేస్తోన్న పరిశోధనలో అంతరించిపోతోన్న అరుదైన మంచు చిరుతలు కెమెరాకు చిక్కాయి. వీటిపై 2017లో 240 మందితో పరిశోధన ప్రారంభించారు. కిలియన్​ షాన్​ జాతీయ వన్యప్రాణి పార్కులోని 4000 చదరపు కి.మీ పరిధిలో 735 కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ కెమెరాల్లో 323 సార్లు మంచు చిరుతలు కనిపించాయి. వాటితో పాటు వివిధ రకాల అరుదైన జంతువులు, 60 రకాల పక్షి జాతులు కెమెరాకు చిక్కాయి.

"ఈ పరిశోధనకు ఉపయోగించిన కెమెరాలు, పరికరాలు అత్యాధునికమైనవి. ముఖ్యంగా ఇన్​ఫ్రా రెడ్​ కెమెరాలు ఎక్కువగా వినియోగించాం. జంతువుల సంఖ్య, జీవ మనుగడపై వివరాల కోసం డీఎన్​ఏ శాంపుల్స్​ సేకరించాం." - షి కున్​, బీజింగ్​ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయ డైరక్టర్​

ఇక్కడి వన్యప్రాణి సంరక్షకులు జంతుజాతులను కాపాడేందుకు శ్రమిస్తున్నారు. వేటగాళ్ల బారిన పడి అరుదైన జంతువులు అంతరించిపోకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండ:చెట్టెక్కిన ఎలుగుబంటి... భయాందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details