తెలంగాణ

telangana

ETV Bharat / international

దక్షిణ కొరియాపై కరోనా పంజా- ఆ నగరాల్లోనూ విజృంభణ - కరోనా వైరస్​ కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 1,04,49,330 కేసులు నమోదయ్యాయి. 5,09,113మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, సింగపూర్​, పాకిస్థాన్​లో వైరస్​ విజృంభణ ఆందోళనకరంగా ఉంది.

SKorea sees COVID-19 cases spread beyond capital
రాజధాని వెలుపల ఆందోళనకరంగా వైరస్​ కేసులు

By

Published : Jun 30, 2020, 7:49 PM IST

కరోనా వైరస్​ దెబ్బకు ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. ఇప్పటివరకు 1,04,49,330మందికి ఈ ప్రాణాంతక మహమ్మారి సోకింది. మొత్తం 5,09,113మంది వైరస్​కు బలయ్యారు.

దేశం కేసులు మృతులు
అమెరికా 26,83,304 1,28,819
బ్రెజిల్​ 13,370,488 58,385
రష్యా 6,47,849 9,320
బ్రిటన్​ 3,11,965 43,575
స్పెయిన్​ 2,96,050 28,346
పెరూ 2,82,365 9,504
చిలీ 2,75,999 5,575
ఇటలీ 2,40,436 34,744
ఇరాన్​ 2,27,662 10,817

రాజధానితో పాటు...

దక్షిణ కొరియాలో తాజాగా 43మందికి వైరస్​ సోకింది. ఇప్పటివరకు కేసులన్నీ రాజధాని సియోల్​లో నమోదయ్యాయి. కానీ ఇప్పుడు ఇతర ప్రధాన నగరాల్లోనూ కేసులు వెలుగుచూడటం అక్కడి అధికారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 12,800 కేసులు నమోదయ్యాయి. 282మంది ప్రాణాలు కోల్పోయారు.

కార్మికులపై వైరస్​ పంజా...

సింగపూర్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 246కేసులు నమోదయ్యాయి. వీరిలో 243మంది విదేశీ కార్మికులే ఉన్నారు. దీంతో ఆ దేశంలో కరోనా వైరస్​ బాధితుల సంఖ్య 43,907కు చేరింది. 26మంది వైరస్​ సోకి మరణించారు.

పురుషులకే అధికంగా...

నేపాల్​లో కొత్తగా 316కేసులు వెలుగుచూడటం వల్ల మొత్తం కేసుల సంఖ్య 13,564కు చేరింది. తాజా కేసుల్లో 245మంది పురుషులు కాగా.. మిగిలిన 71మంది మహిళలు ఉన్నారు. నేపాల్​వ్యాప్తంగా ఇప్పటివరకు 29మంది వైరస్​కు బలయ్యారు. అయితే 3,194మంది వైరస్​ను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

పాకిస్థాన్​లో 2,846...

పాకిస్థాన్​వ్యాప్తంగా కొత్తగా 2,846 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కేసుల సంఖ్య 2,09,337కు చేరింది. తాజాగా 118మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 4,303కు పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details