తెలంగాణ

telangana

ETV Bharat / international

జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష - పార్క్ జ్యూన్​ హై

Park Geun-Hye Jail: జైలు శిక్ష అనుభవిస్తున్న దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్​ గున్​ హైకు క్షమాభిక్షను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. డిసెంబరు 31న పార్క్​ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

skorea-ex-president-park
skorea-ex-president-park

By

Published : Dec 24, 2021, 2:54 PM IST

Park Geun-Hye Jail: అవినీతికి పాల్పడిన కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్​ గున్​​ హైకు క్షమాభిక్ష ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఈనెల 31న ఆమెను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. గతాన్ని మర్చిపోయి దేశ ప్రజలంతా ఐక్యంగా.. కరోనా పరిస్థితులను సమష్టిగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పార్క్​తో పాటు డిసెంబరు 31న మరో 3,093 మంది ఖైదీలను క్షమాభిక్ష కింద విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.

"గతంలో నెలకొన్న ఇబ్బందులను మర్చిపోయి ఓ కొత్త శకంవైపు అడుగులు వేయాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చింది. గత ఐదేళ్లుగా కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షురాలు పార్క్​ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీనిని కూడా పరిగణించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము."

-మూన్‌ జే ఇన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు

పార్క్​.. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 2017లో అరెస్ట్​ అయ్యారు. ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అయితే ఇదంతా తనపై పలువురు చేస్తున్న ప్రతీకార్య చర్యలో భాగం అనేది పార్క్​ వాదన.

ఇదీ చూడండి :హెచ్​-1బీ వీసా ఇంటర్వ్యూపై అమెరికా కీలక ప్రకటన!

ABOUT THE AUTHOR

...view details