తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రధానికి షాక్- ప్రతిపక్ష పార్టీలోకి తమ్ముడు

కరోనా వేళ సింగపూర్​లో రాజకీయం రసవత్తంగా మారుతోంది. ఎన్నికలకు మరో నెల రోజులుగా ఉండగా.. ప్రధాని లీ షియాన్ లూంగ్​ సోదరుడు లీ షియాన్ యాంగ్​ ప్రతిపక్ష పార్టీలో చేరారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

singapore politics
లీ షియాన్

By

Published : Jun 24, 2020, 6:41 PM IST

సింగపూర్​లో ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన ప్రధాని లీ షియాన్​ లూంగ్​కు ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అతని సోదరుడు లీ షియాన్ యాంగ్​ ప్రతిపక్ష ప్రోగ్రెస్​ సింగపూర్​ పార్టీ (పీఎస్​పీ)లో చేరారు.

కుటుంబ కలహాల కారణంగా తాజా పరిస్థితులు నెలకొన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆక్స్​లీ రోడ్‌లోని లీ షియాన్ సోదరుల తండ్రి, సింగపూర్ తొలి ప్రధాని లీ కువాన్​ యూ ఇంటికి సంబంధించి వీరిద్దరి మధ్య దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది.

డాక్టర్​ టాన్​ చెంగ్​ బాక్​ నేతృత్వంలోని పీఎస్​పీలో యాంగ్ బుధవారం సభ్యత్వం తీసుకున్నారు. అయితే యాంగ్​ పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది.

ముందే చేరినా..

అయితే యాంగ్ ఎంతో కాలంగా పీఎస్​పీలో సభ్యుడిగా ఉన్నారని, కరోనా కారణంగా సభ్యత్వం ఇవ్వలేకపోయామని టాన్​ చెంగ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆర్నెల్ల ముందే..

సార్వత్రికానికి ఆరు నెలల ముందే ముందస్తు ఎన్నికలను ప్రతిపాదించారు ప్రధాని లీ షియాన్​. టీవీలో జాతినుద్దేశించి ప్రసంగించిన లీ పార్లమెంట్ రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిట్ జారీ చేయాలని అధ్యక్షుడు హాతలీమా యాకోబ్​కు విజ్ఞప్తి చేశారు.

అనంతరం జూన్​ 23న ఎన్నికల రిట్​ను జారీ చేశారు హాతలీమా. జూన్​ 30న నామినేషన్​ డేగా ఖరారు చేయగా.. జులై 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకునేందుకు ఆ రోజును సెలవు దినంగా ప్రకటించారు.

ఇదీ చూడండి:సింగపూర్​ పార్లమెంటు రద్దు- త్వరలో ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details