ఆస్ట్రేలియా న్యూసౌత్‌వేల్స్ తీరంలో అనేక ప్రాంతాల్లో ఐదు రోజులుగా వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మరోవైపు సాగర తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. బలమైన గాలులు వీయడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.
భారీ వర్షాలతో ఆస్ట్రేలియా అతలాకుతలం
ఆస్ట్రేలియాలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సాగర తీరంలో అలలు భారీఎత్తున ఎగసిపడుతున్నాయి.
ప్రమాదకరంగా వాతావరణ పరిస్థితులు
ఉత్తర తీరంలో 1000 ఇళ్లకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది.
ఇదీ చూడండి:టోంగాలో భూకంపం- 5.1 తీవ్రత నమోదు