తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంగ్​కాంగ్​ హింసాయుతం- రవాణా బంద్!

'నేరస్థుల అప్పగింత బిల్లు'కు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

హాంగ్​కాంగ్​ హింసాయుతం- రవాణా బంద్!

By

Published : Aug 12, 2019, 3:54 PM IST

Updated : Sep 26, 2019, 6:25 PM IST

హాంగ్​కాంగ్​ హింసాయుతం- రవాణా బంద్!

నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా 10 వారాల క్రితం హాంగ్​కాంగ్​లో మొదలైన ఉద్యమం ఇప్పుడు హింసాత్మకంగా మారింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలతో నగరమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

విమానాశ్రయం వద్ద...

హాంగ్​కాంగ్​ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద చేపట్టిన నిరసనలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. సోమవారం వేలమంది ప్రజలు ఎయిర్​పోర్ట్​కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనల దృష్ట్యా విమానసేవలను నిలిపివేశారు అధికారులు.

దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్​ వద్ద నిరసనకారులు పెద్దయెత్తున చేరుకుని ఆందోళనలు చేపట్టారు. నగరంలోని ప్రధాన వాణిజ్య సముదాయాలు, వీధుల గుండా ర్యాలీలు నిర్వహించారు.

అరెస్ట్​లు...

వీధుల్లోకి చేరిన వేల మంది నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బరు బులెట్లు ప్రయోగించారు. పలువురిని అరెస్ట్​ చేశారు. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యంలో తీవ్రంగా గాయప్డడారు.

ఇదీ చూడండి: మయన్మార్​లో వరద విలయతాండవం

Last Updated : Sep 26, 2019, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details