సముద్రంలో మునిగిన ఇరాన్ నేవీ అతిపెద్ద ఓడ - latest international news
11:37 June 02
సముద్రంలో మునిగిన ఇరాన్ నేవీ అతిపెద్ద ఓడ
ఇరాన్ నేవీకి చెందిన అతిపెద్ద ఓడ.. గల్ఫ్ ఆఫ్ ఒమన్(సముద్రం)లో మునిగిపోయింది. అగ్నిప్రమాదం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఈ ఓడను ప్రస్తుతం శిక్షణకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఓడలో ఉన్న సిబ్బంది సహా అందరూ సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది.
చెలరేగిన మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదం జరగగానే సహాయక బృందాలతో ఓడలోని వారందరినీ సురక్షితంగా తరలించినట్లు వెల్లడించింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.