నేపాల్-భారత్ రెండో విడత పెట్టుబడుల ఎక్స్పో కార్యక్రమాన్ని అక్టోబర్ 16-18న నిర్వహించనున్నారు. 3డీ సాంకేతికత ఆధారిత వర్చువల్ వేదిక ద్వారా మూడు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. 'నేపాల్-ఇండియా ఫ్రాంఛైజ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పో అండ్ కాంక్లేవ్' పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఫెడరేషన్ ఆఫ్ నేపాలీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, నేపాల్ ఫ్రాంచైజీ.కామ్ ఈ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
"భారత్, నేపాల్ దేశాల్లోని బ్రాండ్లు, ఫ్రాంచైజీలు ఇరుదేశాలకు భారీగా ప్రయోజనం కలిగిస్తాయి. వ్యాపారాలు, త్వరగా ప్రారంభించేందుకు పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పిస్తాయి. రెండో దఫాలో జరుగుతున్న ఈ సదస్సు ద్వారా భారత్‌లోని ప్రముఖ బ్రాండ్లు నేపాల్‌కు, నేపాల్‌లోని బ్రాండ్లు భారత్‌కు వచ్చేందుకు తోడ్పడుతుంది. ఈ వ్యాపారాలు ఒక దేశం నుంచి మరో దేశానికి రావడం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థలకు మేలు కలుగుతుంది."