కరోనా వైరస్ సృష్టికి కారణమని భావిస్తున్న.. చైనా మాంసపు విక్రయాలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ, ఐక్యరాజ్యసమితిని కోరారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్. ఆ తరహా మాంసం తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదమని, ప్రపంచ జీవన మనుగడే కష్టమని వ్యాఖ్యానించారు.
''మానవాళి ఆరోగ్యంపై ప్రపంచ కోణం నుంచి ఆలోచిస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థనే(డబ్ల్యూహెచ్ఓ) ఏదైనా చేయాలి. ఈ చర్యలు.. డబ్ల్యూహెచ్ఓ, ఐక్యరాజ్యసమితి నుంచే ఉండాలి. ''
- స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 10 లక్షలు దాటాయి. మృతుల సంఖ్య 54 వేలకుపైనే. దాదాపు అన్ని దేశాలకూ విస్తరించింది. ఈ నేపథ్యంలోనే పైవ్యాఖ్యలు చేశారు మోరిసన్.
''వెట్ మార్కెట్లు ఎక్కడైతే ఉన్నాయో.. అక్కడ అది ప్రధాన సమస్య. ఈ వైరస్ చైనాలో ప్రారంభమైంది. ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. అసలు అది ఎలా పుట్టుకొచ్చినట్లు మరి..?.''