కరోనా బారిన పడి కోలుకున్నా వారు రెండో సారి సైతం మహమ్మారి బారినపడే అవకాశాలున్నాయా? అంటే అవుననే సమాధానమిస్తున్నారు హాంకాంగ్ శాస్త్రవేత్తలు. ఓ 33 ఏళ్ల వ్యక్తి రెండోసారి కరోనా బారిన పడినట్లు స్పష్టం చేశారు. ఈ వ్యక్తికి మార్చిలోనే కరోనా సోకింది. వ్యాధి నుంచి కోలుకున్నాక స్పెయిన్ పర్యటనకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. హాంకాంగ్‌లో ఈ తరహా కేసు నమోదు కావడం ఇదే తొలిసారి.
అయితే రెండోసారి కరోనా వచ్చిన వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను 'క్లినికల్ ఇన్ఫెక్టియస్ డిసీస్' జర్నల్ అంగీకరించినప్పటికీ ఇంకా ప్రచురించాల్సి ఉంది.