తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాతో ఆ దేశ మాజీ ప్రధాని కన్నుమూత - కరోనా వైరస్​ మృతులు

కరోనాతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 6కోట్లకుపైగా కేసులు నమోదయ్యాయి. 14లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో సూడాన్​ మాజీ ప్రధాని సాదిక్​ అల్​-మహ్ది కన్నుమూశారు. మరోవైపు బ్రిటన్​లో కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.

Sadiq al-Mahdi, Sudan's former prime minister, dies of virus
కరోనాతో ఆ దేశ మాజీ ప్రధాని కన్నుమూత

By

Published : Nov 26, 2020, 8:36 PM IST

ప్రపంచంపై కరోనా పంజా కొనసాగుతోంది. ఇప్పటివరకు 6,09,08,673 కేసులు బయటపడ్డాయి. మొత్తం మీద 14,30,367 మంది కరోనాకు బలయ్యారు. బ్రిటన్​లో కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.

దేశం కేసులు మృతులు
అమెరికా 1,31,47,864 2,68,404
బ్రెజిల్​ 61,66,898 1,70,799
రష్యా 21,87,990 38,062
ఫ్రాన్స్​ 21,70,097 50,618
స్పెయిన్​ 16,22,632 44,037
బ్రిటన్​ 15,57,007 56,533
ఇటలీ 14,80,874 52,028
అర్జెంటీనా 13,90,388 37,714
కొలంబియా 12,70,991 35,860

బ్రిటన్​లో..

పెరుగుతున్న కేసుల నేపథ్యంలో టైర్​-2 కరోనా నియంత్రణ వ్యవస్థలోకి బ్రిటన్​లోని అనేక ప్రాంతాలు జారుకోనున్నాయి. వీటిల్లో దేశ రాజధాని లండన్​ కూడా ఉంది. డిసెంబర్​ 2తో ముగియనున్న లాక్​డౌన్​ తర్వాత కూడా దేశం హైఅలర్ట్​లో ఉండనుంది.

సూడాన్​ మాజీ ప్రధాని మృతి..

సూడాన్​ మాజీ ప్రధాని సాదిక్​ అల్​-మహ్ది.. కరోనా కారణంగా మృతిచెందారు. యూఏఈలో చికిత్స పొందుతున్న ఆయన 84ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. సూడాన్​లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న చివరి ప్రధానిగా, దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీకి నాయకత్వం వహించిన నేతగా ఆయన గుర్తింపు పొందారు.

పాకిస్థాన్​లో..

పాకిస్థాన్​ విపక్షంలోని ముఖ్య నేత, పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ చీఫ్​ బిలావల్​ భుట్టో జర్దారీకి కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయన ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details