అగ్రరాజ్యం హెచ్చరికలు, ఐరాస ఆంక్షలు బేఖాతరు చేస్తూ క్షిపణుల ప్రయోగాలు కొనసాగిస్తోంది ఉత్తర కొరియా. తాజాగా ఆ దేశం మరో రెండు క్షిపణులను పరీక్షించినట్టు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తర కొరియా తూర్పు తీరం వద్ద ఈ ప్రయోగం జరిగిందని వెల్లడించింది.
ఈ ప్రయోగాలు బాలిస్టిక్ క్షిపణులా లేక రాకెట్ ఫిరంగులా అనే అంశంపై అమెరికా, దక్షిణ కొరియా స్పష్టత ఇవ్వలేదు.
మూన్‌పై ధ్వజం...
క్షిపణుల ప్రయోగం తర్వాత ఓ ప్రకటన విడుదల చేసింది కిమ్ సర్కార్. దాయాది దేశాలు శాంతి చర్చలు జరిపి, సమస్య పరిష్కరించుకోవాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ అనడంపై తీవ్రస్థాయిలో మండిపడింది. మూన్‌ను పరుష పదజాలంతో దూషించింది ఉత్తర కొరియా.
ఆరోసారి...
జులై నుంచి ఉత్తర కొరియాకు ఇది ఆరో ప్రయోగం. అమెరికాతో అణు చర్చలు నిలిచిపోవడం, అమెరికా- దక్షిణ కొరియా కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించడంపై నిరాశ చెందిన ఉత్తరకొరియా.. ఈ విధంగా క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ పరీక్షల ద్వారా అమెరికా, దక్షిణ కొరియాపై ఒత్తిడి పెంచి, అణు చర్చల్లో కదలిక తీసుకురావాలన్నది కిమ్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఇదీ చూడండి- పక్షిరాజా ఎఫెక్ట్: పొలాల్లో ల్యాండైన విమానం