దేశీయంగా తయారు చేసిన స్పేస్ రాకెట్ ప్రయోగానికి దక్షిణ కొరియా (South Korea rocket launch) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే.. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. మూడు దశల్లో సాగే నూరి రాకెట్ ప్రయోగం (South Korea rocket launch) ద్వారా.. 1.5 టన్నుల స్టీల్, అల్యూమినియంతో కూడిన డమ్మీ పేలోడ్‌ను భూకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
షెడ్యూల్‌కు గంట ముందే ప్రయోగం (South Korea rocket launch) చేపట్టాలని అనుకున్నప్పటికీ.. రాకెట్ లోపల వాల్వ్‌లను పరీక్షించేందుకు ఇంజినీర్లు కొంత సమయం కోరినందున ఆలస్యమైంది. రాకెట్లో ఎలాంటి లోపాలు బయటపడలేదని, గాలి వేగం, ఇతర పరిస్థితులను బేరీజు వేసుకొని ప్రయోగం (South Korea rocket launch) చేపడతామని దక్షిణ కొరియా డిప్యూటీ సైన్స్ మినిస్టర్ యోంగ్ హోంగ్ టేక్ పేర్కొన్నారు.
ఫలిస్తే.. పదో దేశం
1990ల నుంచి తమ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇతర దేశాలపై ఆధారపడుతోంది దక్షిణ కొరియా. తాజా ప్రయోగంలో (South Korea rocket launch) విజయం సాధిస్తే.. సొంత సాంకేతికతతో ఉపగ్రహ ప్రయోగం చేపట్టిన పదో దేశంగా చరిత్ర లిఖించనుంది. కమ్యూనికేషన్ శాటిలైట్లు, సైనిక ఉపగ్రహాలు పంపించేందుకు ఈ ఘనత (South Korea satellite launch) సాధించడం చాలా ముఖ్యమని అక్కడి అధికారులు భావిస్తున్నారు. 2030 నాటికి చంద్రుడి అన్వేషణకూ ప్రయోగాలు చేపట్టాలని ప్రణాళికలు వేసుకుంది దక్షిణ కొరియా.