మరో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తనకు వీలు కల్పించే ఓ చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం లాంఛనంగా సంతకం చేశారు. దీనివల్ల ఆయన 2036 వరకూ ఆ పదవిలో కొనసాగేందుకు వీలు కలుగుతుంది.
రాజ్యాంగ సంస్కరణల్లో భాగంగా పుతిన్ తెచ్చిన ఈ ప్రతిపాదనకు మద్దతుగా గత ఏడాది జులైలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు. ఈ బిల్లుకు గత నెలలో చట్టసభ సభ్యులు మద్దతు పలికారు.