ప్రేమికుల రోజున తనకు నచ్చిన వ్యక్తికి 'ఐ లవ్ యూ' అంటూ తన మనసులోని మాటను తెలియజేస్తారు ప్రేమికులు. అయితే రష్యా సైనికుడు మాత్రం వినూత్న రీతిని ఎంచుకున్నాడు. తన మనసులోని మాటను ప్రేయసికి తెలిపేందుకు ఆమె వెళ్లే మర్గాన్ని నిలిపివేశాడు. ఆ తర్వాత 16 యుద్ధ ట్యాంకర్లతో ప్రేమకు చిహ్నమైన లవ్ సింబల్‌ను ఏర్పాటు చేశాడు. గులాబీ పుష్పగుచ్ఛంతో మోకాళ్లపై నిల్చోని ప్రపోజ్ చేశాడు. ఊహించని ఈ పరిణామానికి మురిసిపోయిన ప్రేయసి తన ప్రియుడితో ఏడడుగులు వేసేందుకు అంగీకరించింది.
రష్యా సైనికాధికారి డెనిస్ కజంట్సేవ్ తన ప్రియురాలికి చేసిన ప్రపోజ్ దృశ్యాలను ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వీడియో తీసింది. చాలా ఏళ్లుగా స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరు ప్రేమికుల రోజున ఒక్కటయ్యారని పేర్కొంది.