ఇప్పుడు ప్రపంచమంతా టెక్ మయమే! అత్యాధునిక సాంకేతికతతో రోజుకో సరికొత్త వాహనం మార్కెట్లో సందడి చేస్తోంది. అందుకు తగ్గట్టే వ్యర్థాల సంఖ్యా పెరిగిపోతోంది. మిగిలిపోయిన, పనికిరాని వాహన భాగాలను మనం పడేస్తాం. ఇలాంటి ఆటోమొబైల్ వ్యర్థాలతోనే రష్యాకు చెందిన షెవ్చెంకో కళ్లుచెదిరే శిల్పాలను తయారుచేస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకుండానే వ్యర్థాల నుంచి అందమైన ఆకృతులు రూపొందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.
మాస్కోలో 'ఇంక్రెడిబుల్ వరల్డ్ ఆఫ్ జులెస్ వెర్నె' పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో షెవ్చెంకో రూపొందించిన వస్తువులు వీక్షకులను ఆకట్టుకుంచున్నాయి.
"దాదాపు నాలుగేళ్ల క్రితం నేను కొన్ని పనికిరాని కారు భాగాలను చూశాను. వాటితో ఏదైనా అందమైన వస్తువు రూపొందించాలన్న ఆలోచన వచ్చింది. ఇదంతా అప్పుడు మొదలైంది. నా మొదటి ప్రయత్నం చాలా చిన్నది. అప్పటి నుంచి నేను ఈ పని చేస్తున్నా."
--- ఇగోర్ షెవ్చెంకో, కళాకారుడు.