ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య 4 కోట్ల 38 లక్షల 84 వేలకు చేరింది. మృతుల సంఖ్య 11 లక్షల 66 వేల 240కి పెరిగింది. ఈ నేపథ్యంలో పలు దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొవిడ్ నిబంధనలు తప్పనిసరి చేస్తున్నాయి.
ఇక ఆ దేశంలో మాస్క్ ధరించడం తప్పనిసరి! - Coronavirus death toll in the world
ప్రపంచ దేశాలు కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 4 కోట్ల 38 లక్షల 84 వేలమందికి పైగా కరోనా బారిన పడ్డారు. 11 లక్షల 66 వేల మందికి పైగా కొవిడ్‌తో మృతి చెందారు. రష్యా,ఇరాక్, మెక్సికో, పోలాండ్ దేశాల్లో కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది.
రష్యాలో కరోనా విజృంభణ- మాస్క్ ధరించాలని ఆదేశం
రష్యాలో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న వేళ... ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. దేశంలో ఒక్కరోజే 16,550 మంది వైరస్ బారిన పడగా... 320 మంది ప్రాణాలు కోల్పోయారు.
- పోలాండ్‌లో ఒక్కరోజే 16,300 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 132మంది చనిపోయారు.
- బెల్జియంలో తాజాగా 12,687 కేసులు వెలుగుచూశాయి. మరో 89మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇరాన్లో కొత్తగా 6,968 కేసులు నమోదవగా.. 346 మంది మరణించారు.
- ఉక్రెయిన్‌లో 6,677 కేసులు బయటపడగా.. 126 మంది మృతి చెందారు.
- ఇండోనేషియాలో తాజాగా 3,250 మందికి వైరస్ సోకింది. 101 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మెక్సికోలో కొత్తగా 247 మంది మరణించగా.. 4,166 మంది వైరస్ బారిన పడ్డారు.
- చైనాలో కొత్తగా 26 మంది లక్షణాలు లేకుండా వైరస్ బారిన పడ్డారు.
- సింగపూర్‌లో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గినట్లే కనిపిస్తోంది. కొత్తగా కేవలం ఏడు కేసులే బయటపడ్డాయి.
- శ్రీలంకలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ... సామాజిక వ్యాప్తి లేదని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
ఇదీ చూడండి:'పాంపియో.. మా మధ్య విభేదాలు తేవొద్దు'