తెలంగాణ

telangana

ETV Bharat / international

'స్వేచ్ఛ' కోసం హాంగ్​కాంగ్ వాసుల పోరుబాట

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో హాంగ్​కాంగ్ మరోమారు దద్దరిల్లింది. స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం అడుగులేస్తోందని ఆరోపిస్తూ ప్రజలు నిరసనబాట పట్టారు. నగర వీధుల్ని దిగ్బంధించారు.

'స్వేచ్ఛ' కోసం హాంగ్​కాంగ్ వాసుల పోరుబాట

By

Published : Jul 1, 2019, 12:53 PM IST

'స్వేచ్ఛ' కోసం హాంగ్​కాంగ్ వాసుల పోరుబాట

గతంలో బ్రిటిష్​ పాలనలో ఉన్న హాంగ్​కాంగ్.. చైనా పరిపాలనలోకి వచ్చి నేటికి 22 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 'వాన్ చై'లోని కన్వెన్షన్​ సెంటర్లో సంబరాలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ ఉత్సవాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ వేదిక చుట్టుపక్కల రోడ్లన్నీ దిగ్బంధించారు.

హాంగ్​కాంగ్​ స్వేచ్ఛను చైనా హరించేందుకు వీలుగా ప్రభుత్వం అడుగులేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనకారులు. వారిని అదుపుచేసేందుకు పెద్దఎత్తున పోలీసులను మోహరించింది ప్రభుత్వం. అత్యంత భారీ భద్రత మధ్యే జెండా వందనం చేశారు అధికారులు.

బ్రిటిష్​ నుంచి చైనా పాలనకు..

బ్రిటిష్​ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న హాంగ్​కాంగ్ 1997 జులై 1న చైనా పరిపాలనలోకి వచ్చింది. 'ఒకే దేశం, రెండు వ్యవస్థలు' ద్వారా ఇప్పటికీ ప్రత్యేక పాలన సాగిస్తోంది.

నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​ ప్రజలు ఇటీవలే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దాదాపు వారం రోజుల పాటు నిర్విరామంగా జరిగిన ఆందోళనల అనంతరం ఆ బిల్లును పక్కనబెడుతున్నట్లు హాంగ్​కాంగ్ ప్రభుత్వాధికారులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details