చైనా రక్షణ మంత్రి వీ ఫెంగీతో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యే అవకాశం ఉంది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సు కోసం మాస్కో వెళ్లారు రాజ్‌నాథ్. ఇదే వేదికగా ఫెంగీతో భేటీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు సమాచారం.
లద్దాఖ్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న వేళ.. రాజ్‌నాథ్‌తో భేటీ కోసం చైనా ఫెంగీ సుముఖంగా ఉన్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని చైనానే కోరినట్లు సమాచారం. ఇరు దేశాల రక్షణ మంత్రులు సమావేశం కావాలనే తన అభీష్టాన్ని చైనా.. భారత అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.
అత్యున్నత భేటీ..