తెలంగాణ

telangana

ETV Bharat / international

'చట్టాల బలోపేతంతోనే ఉగ్రవాదం అంతం'

ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ సూచించారు. ఇందుకు అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయాలని సూచించారు. ఉజ్బెకిస్థాన్​లో షాంఘై సహకార సమాఖ్య సదస్సులో ఆయన ప్రసంగించారు.

రాజ్​నాథ్

By

Published : Nov 2, 2019, 1:25 PM IST

Updated : Nov 2, 2019, 7:56 PM IST

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ చట్టాలను, వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరముందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.

ఉగ్రవాదం కారణంగా భారతీయ సమాజం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. అభివృద్ధి ప్రయత్నాలకు అడ్డుతగులుతోందని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేసి పూర్తి స్థాయిలో అమలుచేయాలని సూచించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు, ద్వంద్వవిధానాలు లేకుండా చూడాలన్నారు.

ఆర్థిక సహకారం అనేది భవిష్యత్తులో ప్రజలను ఏకం చేసేందుకు, వారికి మంచి జీవితాన్ని అందించేందుకు ఉపయోగపడే పునాదిగా రాజ్‌నాథ్ అభివర్ణించారు. అందువలనే భారత్‌కు అదిచాలా కీలకమైన అంశంగా పేర్కొన్నారు. ఏకపక్షంగా, రక్షణాత్మక విధానాల ద్వారా ఎవరికీ లబ్ధి చేకూరదన్నారు రాజ్‌నాథ్. ఈ నేపథ్యంలోనే భారత్ పారదర్శకమైన వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోందన్నారు.

ఇదీ చూడండి : చైనావ్యాప్తంగా 5జీ సేవలు షురూ- భారత్​లో ఎప్పుడో?

Last Updated : Nov 2, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details