తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రాజపక్స ముందంజ - sirlanka president elections

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రతిపక్ష నేత గోబటయా రాజపక్స 52.87శాతం ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి సాజిత్ ప్రేమదాసకు 39.67శాతం ఓట్లు నమోదయ్యాయి.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రాజపక్స ముందంజ

By

Published : Nov 17, 2019, 9:32 AM IST

Updated : Nov 17, 2019, 12:06 PM IST

శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో.. రక్షణ శాఖ మాజీ కార్యదర్శి గోబటయా రాజపక్స ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో రాజపక్సకు 52.87 శాతం ఓట్ల నమోదయ్యాయి. ఆయన ప్రధాన ప్రత్యర్థి యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన సాజిత్ ప్రేమదాస 39.67 శాతం ఓట్లు నమోదయ్యాయి.

శ్రీలంక వ్యాప్తంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైనట్లు.. దాదాపు 15.99 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం తెలిపింది. శ్రీలంకలో సింహళీలు ఆధికంగా ఉండే ప్రాంతాల్లో రాజపక్స ఆధిక్యంలో ఉండగా సాజిత్‌ ప్రేమదాసకు తమిళ వర్గాల నుంచి అధిక మద్దతు ఉంది.

ఇదీ చూడండి: నవాజ్​షరీఫ్​ విదేశీ ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్​

Last Updated : Nov 17, 2019, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details