థాయ్‌లాండ్‌లో వరద విలయం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో థాయ్ అతలాకుతలం అవుతోంది. రిజర్వాయర్లకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండగా.. దీంతో గేట్లు ఎత్తివేశారు. దీంతో సెంట్రల్ థాయ్ ప్రావిన్స్ సుఫాన్ బురీలో వరద బీభత్సం సృష్టించింది. థా చిన్ నది సమీప ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
ఎటు చూసినా నీరే.. థాయ్‌లాండ్‌లో ఇదీ పరిస్థితి!
థాయ్‌లాండ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదనీటితో రిజర్వాయర్లలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జనావాసాల్లోకి నీరు వచ్చి చేరింది. పంటపొలాలు నీటమునిగాయి.
థాయ్‌లాండ్‌లో వరదలు
వరద కారణంగా జనావాసాల్లోకి నీరు వచ్చి చేరింది. పంటపొలాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులతో సహా కాలనీలు జలమయమయ్యాయి. దాదాపు 38,000 కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విపత్తు నిర్వహణ శాఖ సహాయక చర్యల్లో నిమగ్నమైంది.
ఇదీ చదవండి:బంగ్లాదేశ్‌లో ఆలయాలపై దాడులు- అల్లర్లలో నలుగురు మృతి