తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ20 సదస్సు: అందరి కళ్లు పుతిన్​ 'మగ్​'పైనే - పుతిన్​

జీ20 సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన అధికారిక విందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ తన సొంత మగ్​ను వినియోగించడం అందరిని ఆశ్చర్యపరిచింది. పుతిన్​కు ఎవరిపైనా నమ్మకం లేకపోవడం వల్లే సొంత మగ్​ తీసుకొచ్చారని సామాజిక మాధ్యమాల్లో పలువురు విమర్శిస్తున్నారు.

జీ20 సదస్సు: అందరి కళ్లు పుతిన్​ 'మగ్​'పైనే

By

Published : Jun 29, 2019, 5:15 AM IST

జపాన్​ వేదికగా 14వ జీ20 సదస్సు జరుగుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక దేశాధ్యక్షులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఎన్నో దేశాల మధ్య ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. వీటి మధ్య ఓ 'మగ్​' అందరిని ఆకర్షిస్తోంది. అదే అధికారిక విందులో రష్యా అధ్యక్షుడు వినియోగించిన తెలుపు రంగు మగ్​.

ఎవరిపైనా నమ్మకం లేకే...?

జీ20 సదస్సుకు పుతిన్​ తన సొంత మగ్​ తెచ్చుకున్నారు. అధికారిక విందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పక్కన కూర్చున్న 66 ఏళ్ల పుతిన్​... తెలుపు రంగు మగ్​ను పట్టుకుని కనబడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సొంత మగ్​ను పుతిన్​ వినియోగించడంపై కొందరు చురకలు అంటిస్తుంటే... రష్యా అధ్యక్షుడికి ఎవరిపైనా నమ్మకం లేదని మరికొందరు విమర్శిస్తున్నారు.

ఈ విషయంపై ఓ రష్యా ప్రతినిధి స్పందించారు. ఆ మగ్​లోనే పుతిన్​ నిత్యం టీ తాగుతారని వెల్లడించారు.

జీ20 సదస్సు శనివారంతో ముగియనుంది. ట్రంప్​, బ్రిటన్​ ప్రధాని థెరెసా మే సహా పలువురు నేతలతో పుతిన్​ శుక్రవారం చర్చలు జరిపారు.

ఇదీ చూడండి:-టీమిండియా ఆరెంజ్ జెర్సీ ఇదే..

ABOUT THE AUTHOR

...view details