సింగపుర్కు చెందిన ప్రముఖ పత్రిక రూపొందించిన''ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్' జాబితాలో సీరమ్ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాను కట్టడి చేసేందుకు విశేషంగా కృషి చేసిన ఆరుగురితో ఈ జాబితా రూపొందించారు. వీరిని 'కరోనా బస్టర్స్'గా అభివర్ణించింది ఆ పత్రిక.
ఆరుగురు వీరే..
- అదర్ పూనావాలా - సీరమ్ సంస్థ సీఈఓ
- జాంగ్ యోంగ్జెన్-చైనా పరిశోధకులు
- చెన్వీ -చైనా మేజర్ జనరల్
- డా.రుయిచి మోరిస్తా- జపాన్ వైద్యులు
- వూయి ఎంగ్ ఆంగ్-సింగపుర్ అధ్యాపకులు
- సియో జంగ్-జిన్ - దక్షిణ కొరియా పారిశ్రామిక వేత్త