తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ-20: మోదీ-ట్రంప్​ '5జీ' స్నేహగీతం - డొనాల్డ్​ ట్రంప్

జపాన్​ జీ-20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలు, ఇరాన్ వివాదం​, 5జీ కమ్యూనికేషన్​ నెట్​వర్క్​, వాణిజ్యం, రక్షణ వంటి అంతర్జాతీయ అంశాలపై ప్రధానంగా చర్చించారు.

జీ-20: మోదీ-ట్రంప్​ '5జీ' స్నేహగీతం

By

Published : Jun 28, 2019, 11:12 AM IST

జీ-20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్​, భారత ప్రధాని మోదీ జపాన్​ ఒసాకాలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించారు. ప్రధానంగా సాంకేతిక శక్తిని పెంచే మార్గాలు, రక్షణ, భద్రతా సంబంధాలను మెరుగుపరచటం, వాణిజ్యం,ఇరాన్​ వివాదం, 5జీ కమ్యూనికేషన్​ నెట్​వర్క్​ వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు.

భారత్​తో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియోతో లేఖ పంపడంపై ట్రంప్​కు కృతజ్ఞతలు తెలిపారు మోదీ.

ట్రంప్​తో భేటీలో మాట్లాడుతున్న మోదీ

"నాలుగు అంశాలపై చర్చే ప్రధాన అజెండా. ఇరాన్​, 5జీ, ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సంబంధాలపై విస్తృతంగా చర్చ చేపట్టాం. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉంది. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి

రెండోసారి అధికారం చేపట్టినందుకు మోదీకి ట్రంప్​ అభినందనలు తెలిపారు. రక్షణ రంగంతో పాటు వివిధ అంశాల్లో ఇరు దేశాల పరస్పర సహకారం మరింత పెరగాలని అభిలషించారు.

ఇదీ చూడండి: ఉగ్రవాదంపై ఐకమత్యంగా పోరాడదాం:మోదీ

ABOUT THE AUTHOR

...view details