తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీకి భూటాన్​ రాజు ఫోన్​.. భారత్​కు ఆహ్వానించిన ప్రధాని - రాజపక్స

భూటాన్​ రాజు జిగ్మే ఖేసర్​ వాంగ్​చుక్​ను కుటుంబసమేతంగా భారత్​కు ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోదీ. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వాంగ్​చుక్​ను.. సరైన సమయం చూసుకొని భారత్​ రావాలని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనా ఇరువురు నేతలు చర్చించుకున్నారు.

PM Modi holds telephonic talks with Bhutan's King, Lankan president, prime minister
భూటాన్​ రాజును భారత్​కు ఆహ్వానించిన మోదీ

By

Published : Sep 18, 2020, 6:25 PM IST

పుట్టినరోజు పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రష్యా, అమెరికా అధ్యక్షులు, భూటాన్​ రాజు, శ్రీలంక ప్రధాని, అధ్యక్షుడు సహా పలువురు దేశాధినేతలు ఫోన్​ చేసి మోదీకి విష్​ చేశారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకున్నారు.

ఇదీ చూడండి:ఫోన్ చర్చల్లో మోదీ, పుతిన్​ స్నేహగీతం

మోదీకి ఫోన్​ చేసిన భూటాన్​ రాజు జిగ్మే ఖేసర్​ వాంగ్​చుక్​.. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. భారత్​-భూటాన్​ మధ్య చక్కటి సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసుకున్నారు ఇరువురు నేతలు. ఈ సందర్భంగా.. మంచి సమయం చూసుకొని కుటుంబసమేతంగా భారత్​ సందర్శించాలని వాంగ్​చుక్​ను ఆహ్వానించారు మోదీ.

భారత ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కరోనాపై పోరులోనూ పరస్పర సహకారం ఉండాలని కోరారు.

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన నేతలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details