జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఒసాకాలో జరిగే జీ-20 సదస్సులో భాగంగా ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యారు. రెండు దేశాల అధికారులతో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రీవా శకం( మే1న జపాన్ చక్రవర్తి నరుహిటో సింహాసనం అధిష్టించిన రోజుతో మొదలైన శకం) ప్రారంభమైన అనంతరం ఇరువురి మధ్య ఇది తొలి సమావేశం.
అక్టోబర్‌లో జరిగే నరుహిటో చక్రవర్తి పట్టాభిషేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొంటారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రీవా శకం ప్రారంభం సందర్భంగా జపాన్ ప్రజలకు అభినందనలు తెలిపారు.
షింజో అబేతో మోదీ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే వార్షిక సదస్సుకు అబే భారత్లో పర్యటించాలని మోదీ కోరినట్లు పేర్కొన్నారు.
కీలక అంశాలపై చర్చ