కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక తన తొలి విదేశీ పర్యటన కోసం మాల్దీవులకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి అబ్దుల్లా షాహిద్ మాలే విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు.
చిన్నారులతో మమేకం
మోదీకి స్వాగతం పలుకుతూ మాల్దీవుల సంప్రదాయ వస్త్రాలు ధరించిన చిన్నారులు నృత్యాలు చేశారు. అనంతరం ఆ దేశ భద్రతా బలగాలు చేసిన సైనిక వందనాన్ని స్వీకరించారు మోదీ. ఇందులో భాగంగా ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు.
విమానాశ్రయంలో చిన్నారులతో మమేకమయ్యారు మోదీ. వారితో కాసేపు ముచ్చటించారు.
మాల్దీవుల అత్యున్నత పురస్కారం
విదేశాలకు చెందిన విశిష్ట నేతలకు మాల్దీవులు అందించే అత్యున్నత గౌరవ పురస్కారం 'రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్'తో సత్కరించనున్నామని ట్విట్టర్ వేదికగా ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్ ప్రకటించారు.
దృఢ బంధమే లక్ష్యంగా
'పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యం' అనే విధానాన్ని అనుసరించి తొలి పర్యటనకు మాల్దీవుల్ని ఎంచుకున్నారు.
హిందూ మహా సముద్రంలోని ద్వీపదేశంతో సంబంధాలను సుదృఢం చేసుకోవడం లక్ష్యంగా మోదీ ఈ పర్యటన తలపెట్టారు. మాల్దీవుల్ని విలువైన భాగస్వామిగా భావిస్తున్నామని చెప్పారు మోదీ. గతేడాది నవంబర్లో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ప్రధాని.
మాల్దీవుల్లో మోదీకి ఘన స్వాగతం ఇదీ చూడండి: వరుణుడి కరుణ కోసం 'కప్పల పెళ్లి'