తెలంగాణ

telangana

ETV Bharat / international

పక్షిరాజా ఎఫెక్ట్​: పొలాల్లో ల్యాండైన విమానం - పంట చేలో

రష్యా మాస్కోలోని జుకోవ్​స్కీ విమానాశ్రయం​ నుంచి బయలుదైరిన ఎ-321 విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా పక్షులు ఢీకొని... ఇంజిన్​ దెబ్బతింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. విమానాన్ని చాకచక్యంగా పైలట్​ పొలాల్లో దించారు.

పంట చేలో వాలిన లోహ విహంగం

By

Published : Aug 16, 2019, 9:45 AM IST

Updated : Sep 27, 2019, 4:03 AM IST

పంట చేలో వాలిన లోహ విహంగం

రన్​వేపై దూసుకెళ్లిన విమానం గాల్లోకి ఎగిరింది. కొద్ది క్షణాల్లోనే భారీ కుదుపు! రెక్కలు తెగిన పక్షిలా ఊగిపోతోంది. ఏమవుతుందో తెలియక ప్రయాణికుల హాహాకారాలు చేస్తున్నారు. ఒక్కసారిగా లోహ విహంగం పంట పొలాల్లో దిగింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు.

రష్యాకు చెందిన ఎ-321 విమానానికి గురువారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మాస్కోలోని జుకోవ్​స్కీ ఎయిర్​పోర్ట్​ నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే గుంపుగా వచ్చిన పక్షులు విమానాన్ని ఢీకొట్టాయి. ఇంజిన్లలోకి కొన్ని పక్షలు చొచ్చుకుపోయాయి. ప్రమాదాన్ని గ్రహించిన పైలట్​ విమానాన్ని వెంటనే చాకచక్యంగా పొలాల్లో దించారు. ఆ సమయంలో విమానంలో 226 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. అత్యవసర ల్యాండింగ్​ వల్ల కుదుపులకు గురై 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాణ నష్టాన్ని నివారిస్తూ సురక్షితంగా విమానాన్ని దింపిన పైలట్​ పై ప్రశంసల వర్షం కురిసింది.

ఇదీ చూడండి : తుపాను​ ధాటికి జపాను అతలాకుతలం

Last Updated : Sep 27, 2019, 4:03 AM IST

ABOUT THE AUTHOR

...view details