కరోనా వైరస్.. చైనాతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాలనూ వణకిస్తోంది. ఇప్పటి వరకు చైనాలో 170 మంది మృతి చెందారు. పలు దేశాలు కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్‌లు ధరించడమే మేలైన మార్గమని వైద్యులు చెప్పిన నేపథ్యంలో పలు దేశాల్లో వాటికి డిమాండ్ పెరుగుతోంది.
హాంకాంగ్...
హాంకాంగ్‌లో మాస్క్‌లకు డిమాండ్ విపరీతంగా ఉంది. వాటిని కొనేందుకు అక్కడి ప్రజలు గంటల తరబడి లైన్లో నిల్చుంటున్నారు. దుకాణదారులు ఎంత సరుకు తెచ్చినా క్షణాల్లో అయిపోతోంది. భారీ డిమాండ్ దృష్ట్యా టోకెన్ పద్ధతి అవలంబిస్తున్నారు వ్యాపారులు. షాపు తెరవకముందే ప్రజలకు చిట్టీలు రాసి ఇస్తున్నారు. అవి ఉన్న వారికి మాత్రమే మాస్క్‌లు విక్రయిస్తున్నారు.
మాస్క్‌ల ధరలూ భారీగా పెరిగాయి. కొన్ని చోట్ల మాస్క్‌ల పెట్టె ఒక్కొక్కటి 7 డాలర్లకు విక్రయిస్తుండగా... మరికొన్ని చోట్ల ఏకంగా 65 డాలర్లు పలుకుతోంది.
తైవాన్లోనూ...
తైవాన్ దేశంలో మాస్క్ ధరించే ప్రజలు బయటకు వస్తున్నారు. ఇది కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తప్పనిసరని అంటున్నారు.