తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​​లో వ్యాను బోల్తా- 13 మంది సజీవదహనం

పాకిస్థాన్​లోని హైదరాబాద్​లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బోల్తా పడిన వ్యానులో మంటలు చెలరేగాయి. దీంతో 13 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

pak bus accident
పాక్​​లో వ్యాను బోల్తా- 13 మంది సజీవదహనం

By

Published : Sep 27, 2020, 11:03 AM IST

పాకిస్థాన్​లో జరిగిన ఘోర వ్యాను ప్రమాదంలో 13 మంది మరణించారు. 22 మందితో ప్రయాణిస్తున్న వ్యాను హైదరాబాద్ సమీపంలోని నూరియాబాద్​ వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా తలకిందులైపోయింది. బోల్తా కొట్టిన అనంతరం వ్యానుకు నిప్పంటుకుంది. దీంతో ప్రయాణికుల్లో పలువురుకు అగ్నికి ఆహుతైపోయారు. ఏడాది వయసున్న ఓ చిన్నారి, డ్రైవర్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

పాకిస్థాన్​లోని హైదరాబాద్ నుంచి కరాచీకి ఈ వ్యాను ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాను కింది భాగంలో ఉండే 'టై రాడ్‌' విరిగిపోవడం వల్లే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సమయంలో వాహన వేగం అధికంగా ఉండడంతో బోల్తా కొట్టిన వ్యానులో వెంటనే మంటలు అంటుకున్నాయని కరాచీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అవి కాస్తా ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయని.. దీంతో ప్రయాణికులు మృతి చెందారని వెల్లడించారు.

"హైదరాబాద్ నుంచి 60 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యాను పూర్తిగా ధ్వంసమైంది. చాలా మందికి కాలిన గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది."

-డా. అఫ్తాబ్ పఠాన్, అడిషనల్ ఐజీ మోటార్​వే పోలీస్

ABOUT THE AUTHOR

...view details