తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​కు పాక్ బృందం- జలవివాదాలపై చర్చ - జహీద్ హఫీజ్ చౌదరీ

పాకిస్థాన్​కు చెందిన జల నిపుణుల బృందం వచ్చేవారం భారత్​కు రానుంది. మార్చి 23, 24 తేదీల్లో దిల్లీలో జరగనున్న 116వ శాశ్వత సింధు నదీ కమిషన్ సమావేశంలో ఈ బృందం పాల్గొననున్నట్లు పాక్ వర్గాలు తెలిపాయి.

Pak's delegation to visit India next week for talks on water-related issues
భారత్​కు పాక్ నిపుణుల బృందం- జలవివాదాలపై చర్చ

By

Published : Mar 20, 2021, 6:16 AM IST

పాక్​లోని జల సంబంధిత నిపుణులు వచ్చేవారం భారత్​కు రానున్నట్లు ఆ దేశం తెలిపింది. మార్చి 23, 24న దేశ రాజధానిలో జరగబోయే 116వ శాశ్వత సింధు నదీ కమిషన్ సమావేశంలో వారి నిపుణుల బృందం పాల్గొనున్నట్లు పాక్ విదేశాంగ ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌదరీ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై ఇరు దేశాల నిపుణుల బృందం చర్చించనున్నట్లు వివరించారు. భారత్​ తరపున సింధు నదీ జలాల కమిషనర్‌ పీకే సక్సేనా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

జమ్ముకశ్మీర్​లో అధికరణ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారి జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి :'భారతీయ విద్యార్థులకు చైనా టీకా'పై పరిశీలిస్తాం'

ABOUT THE AUTHOR

...view details