పాకిస్థాన్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జాఫర్ మిర్జాకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా ఆయనే ప్రకటించారు.
"నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నాకు వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. నా కోసం భగవంతుడ్ని ప్రార్థించండి."
-జాఫర్ మిర్జా, పాక్ ఆరోగ్య శాఖ మంత్రి.