తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​తో అణుయుద్ధం మేము మొదలు పెట్టం'

ఆర్టికల్​ 370 రద్దుతో భారత్​-పాక్​ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం మొదటగా అణ్వాయుధాలను భారత్​పై ప్రయోగించదని స్పష్టం చేశారు.

'భారత్​తో అణుయుద్ధం మేము మొదలు పెట్టం'

By

Published : Sep 2, 2019, 11:41 PM IST

Updated : Sep 29, 2019, 5:49 AM IST

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో భారత్‌- పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తమ దేశం మొదటగా అణ్వాయుధాల్ని భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించబోదన్నారు.

లాహోర్‌లోని సిక్కులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

"ఇరు దేశాలూ అణ్వాయుధాలు కలిగి ఉన్నవే. భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా కొనసాగితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది" - ఇమ్రాన్​ ఖాన్​

జమ్ముకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుచేయడం వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్‌తో అణుయుద్ధానికి సిద్ధమేనని గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి చెందిన కొందరు మంత్రులు కూడా పూటకో ప్రకటనలు చేస్తూ మరింతగా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదీ చూడండి:మోదీకి 'గేట్స్​' పురస్కారం తెచ్చిన స్వచ్ఛ భారత్

Last Updated : Sep 29, 2019, 5:49 AM IST

ABOUT THE AUTHOR

...view details