తెలంగాణ

telangana

ETV Bharat / international

'గ్రే' జాబితాలోనే పాక్​.. జూన్​ వరకు గడువు - 27-point Action Plan

పాకిస్థాన్​ను 'గ్రే' జాబితాలోనే కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్) ప్రకటించింది. ఉగ్రసంస్థలకు నిధుల రాకను నియంత్రించలేకపోవడంపై ఆక్షేపించింది. తమ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు జూన్ వరకు గడువు విధించింది ఎఫ్​ఏటీఎఫ్.

pak-fatf
'గ్రే' జాబితాలోనే పాక్​.. జూన్​ వరకు గడువు

By

Published : Feb 21, 2020, 4:41 PM IST

Updated : Mar 2, 2020, 2:10 AM IST

పాక్​ను 'గ్రే' లిస్టులోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్). ఉగ్రవాదానికి ఆర్థిక సహాయాన్ని నియంత్రించలేకపోవడంపై పారిస్​ వేదికగా జరుగుతున్న ఎఫ్​ఏటీఎఫ్​ ప్లీనరీలో దాయాదికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జూన్ నాటికి తమ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది.

లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలకు అందే నిధులను నియంత్రించలేకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో మరోసారి ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమైన నేపథ్యంలో బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పదని హెచ్చరించింది. ప్రస్తుతం ఇరాన్‌, ఉత్తర కొరియా మాత్రమే ‘బ్లాక్‌ లిస్ట్‌’లో ఉన్నాయి.

ఈ మేరకు ఉగ్రముఠాలకు నిధుల సరఫరాను కట్టడి చేసేందుకు కొత్తగా మరో 8 అంశాలతో కూడిన లక్ష్యాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ముందుంచింది. టర్కీ మినహా ఎఫ్‌ఏటీఎఫ్‌ సభ్యదేశాలన్నీ పాక్‌ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి:గ్రే లిస్టుతో పాకిస్థాన్​కు ఎదురుదెబ్బే: రావత్​

Last Updated : Mar 2, 2020, 2:10 AM IST

ABOUT THE AUTHOR

...view details